నిజందాగదుక్షణంఆగదు

Feb 14 2023, 10:01

బీసీల కుల ప్రాతిపదికన జనగణన చేయాలి:BSP నల్లగొండ కమిటీ

బహుజన్ సమాజ్ పార్టీ నల్లగొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో బీసీల కుల ప్రాతిపదికన జనగణన చేయాలి, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి, 60 నుంచి 70 అసెంబ్లీ టికెట్లను కేటాయించాలి, అనే నినాదాలను ప్రజలకు వివరిస్తూ వారి సంతకాల ద్వారా మద్దతు తెలియజేయాలని కోరగా వివిధ వర్గాల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి పంబాల అనిల్ గారు, ఉపాధ్యక్షులు కోడి భీం ప్రసాద్ గారు, మహిళ కన్వీనర్ గోస్కొండ కవిత గారు, నియోజకవర్గ ఇన్చార్జీలు వంటపాక యాదగిరి, అంకెపాక శ్రీనివాస్ గార్లు నియోజకవర్గ అధ్యక్షులు దున్న లింగస్వామి అడ్వకేట్ గారు తిప్పర్తి మండల అధ్యక్షులు పేరపాక లింగస్వామి గారు, ప్రధాన కార్యదర్శి దాసరపు నవీన్ కుమార్, పజ్జురు గ్రామ శాఖ అధ్యక్షులు దాసరపు రవితేజ మరియు వీరస్వామి, కృష్ణయ్య, సతీష్, వెంకన్న, యాదయ్య తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 13 2023, 19:10

వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత మహాసభ లకు తరలి వెళ్లిన జిల్లా ప్రతినిధులు

వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత మహాసభ లకు తరలి వెళ్లిన జిల్లా ప్రతినిధులు

: ఈనెల 15 నుండి 18 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా లో జరిగే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుండి ప్రతినిధులు నల్గొండ రైల్వే స్టేషన్ నుండి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యురాలు దండంపల్లి సరోజ మాట్లాడుతూ ఈ మహాసభలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అనేక తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో వ్యవసాయ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. 50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు ఐదువేల రూపాయల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు, సాగు భూములు ఇవ్వాలని కోరారు. వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సమగ్ర కేంద్ర శాసన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 18న హౌరా లో లక్షలాదిమంది వ్యవసాయ కార్మికులతో భారీ బహిరంగ సభ జరుగుతుందని ,ఈ సభకు ముఖ్యఅతిథిగా కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఆల్ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి .వెంకట్ తదితర నాయకులు హాజరవుతున్నారని అన్నారు. పట్టణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు ఈ మహాసభలలో ఉపాధి హామీ రక్షణ కోసం చేసే ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు

  ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మట్టిపల్లి సైదులు, కంబాలపల్లి ఆనంద్ ,జటావత్ రవి నాయక్, పులుసు సత్యం, జిల్లా ఉపాధ్యక్షులు గండమల్ల రాములు బెల్లంకొండ వెంకటేశ్వర్లు ,జిల్లా కమిటీ సభ్యులు లంజాపెళ్లి లక్ష్మయ్య ,పులసరి వెంకట ముత్యం కెవిపిఎస్ జిల్లా నాయకులు దేవరకొండ యాదగిరి, తదితరులు తరలి వెళ్లారు.

    జాతీయ మహాసభలకు తరలి వెళ్తున్న వారికి సెండ్ ఆఫ్ చెప్పిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మన్య బిక్షం తదితరులున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 13 2023, 18:42

మిరియాల వెంకటేశం గారిని రాష్ట్ర చేనేత సెల్ కో కన్వీనర్ గా నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేసిన బిజెపి రాష్ట్ర ఓబిసి అధ్యక్షులు ఆలే భాస్కర్

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆలే భాస్కర్ రాజు గారు, శ్రీ మిరియాల వెంకటేశం గారిని రాష్ట్ర చేనేత సెల్ కో కన్వీనర్ గా నియమిస్తూ నియామక ఉత్తర్వులు అందజేశారు.ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ఓబిసి అధ్యక్షులు శ్రీ ఆలే భాస్కర్ రాజు గారికి అలాగే నా నియామకానికి సహకరించిన జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ డాక్టర్ లక్ష్మణ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారికి, రాష్ట్ర చేనేత కన్వినర్ శ్రీ ఎన్నం శివ కుమార్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు మరియు జిల్లా రాష్ట్ర నాయకుల అందరికి కృతజ్ఞతలుుు తెలియజేశారు. ఈ సందర్భంగాా వెంకటేశం గారుు మాట్లాడుతూ బాధ్యతగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నిర్వర్తిస్తూ రాష్ట్రములో ఉన్నటువంటి చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే విధంగా కార్యక్రమాలను ఉదృతం చేస్తాననిి తెలియజేశారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 13 2023, 17:46

నల్గొండ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించిన సమాచార హక్కు వికాస సమితి క్యాలెండర్

నల్గొండ జిల్లా కలెక్టర్ రెట్ లో సమాచార హక్కు వికాస సమితి 2023 క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణా రెడ్డీ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు గార్ల చేతుల మీదుగా ఆవిష్కరణ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ యర్ర మాద కృష్ణా రెడ్డి జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్ కారుణ్ కుమార్, సైదులు గౌడ్ ,రామ కృష్ణ, యం. వెంకన్న, రమణ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 13 2023, 17:28

దేశానికి కల్నల్ సంతోష్ బాబు చేసిన సేవలు మరువలేనివి

దేశానికి కల్నల్ సంతోష్ బాబు చేసిన సేవలు మరువలేనివి

దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన బిక్కుమళ్ల కల్నల్ సంతోష్ బాబు చేసిన సేవలు మరువలేనివని విశ్రాంత ఉపాధ్యాయులు సంతోష్ బాబు మామ తల్లాడ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద గల సంతోష్ బాబు 39వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతోష్ బాబు వీరమరణం పొంది రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న చైనా సరిహద్దు గాల్విన్ లోయలో ఇంకా అలజడులు జరుగుతూనే ఉన్నాయని విచారణ వ్యక్తం చేశారు. దేశం కోసం తెగించి ప్రాణత్యాగం చేసి ఎందరో సైనికులను రక్షించారని తెలిపారు. ఆయన చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు.ఈ కార్యక్రమంలో తల్లాడ ఉమ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 13 2023, 17:21

కలెక్టర్ కార్యాలయం పైకెక్కి భూసమస్య తీర్చాలని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం..

కలెక్టర్ కార్యాలయం పైకెక్కి భూసమస్య తీర్చాలని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం..

▪️జనగామ - కలెక్టర్ కార్యాలయం పైకెక్కి భూసమస్య పరిష్కరించాలని ఇద్దరు భార్య భర్తల హల్చల్.

▪️ఎమ్మర్వో తమ భూమిని ఇతరులకు అక్రమ పట్టా చేసారని, తమ సమస్య పరిష్కారించాలని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం, అడ్డుకున్న పోలీసులు.

▪️గతంలో కూడా ఆత్మహత్యయత్ననికి పాల్పడిన బాధితుడు నర్సింగరావు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 13 2023, 14:45

అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరు..MRPS జాతీయ నాయకులు కందుల మోహన్ మాదిగ.....

అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరు..MRPS జాతీయ నాయకులు కందుల మోహన్ మాదిగ.....     హైవే దిగ్బంధానికి ముందే నాయకులనుపోలీసులు అరెస్టు చేయడం సమంజసం కాదని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు అన్నారు.కందుల మోహన్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధ కల్పిస్తామని హామీ ఇచ్చి గత తొమ్మిది సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నందున ఈరోజు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం హైదరాబాద్ టు విజయవాడ హైవే ద్రి గ్బంధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ముందస్తుగాMRPS, MSP నాయకులని అరెస్టు చేయడం కేంద్ర ప్రభుత్వం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ చేశారు. ఎస్సీ ఉరీకరణ చేయకపోతే 59 పప్పులాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఎలక్షన్లో మాదిగ మాదిగ ఉప కులాలను వాడుకొని గెలిచేంతవరకు వడమల్లయ్య గెలిచిన తర్వాత బోడమలై అన్న విధంగా  చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏర్పుల శ్రవణ్ కుమార్, వడ్డే రవి, దుబ్బ సత్యనారాయణతదితరులు ఉన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 13 2023, 14:37

నక్రేకల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తో పాటు పాల్గొని శంకుస్థాపన చేసిన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్

నక్రేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలంలోని కొండకిందిగూడెం గ్రామంలో రూ. 25 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారితో కలిసి శంకుస్థాపన చేసిన రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గారు.

ఈ సందర్భంగా ఎంపి బడుగుల మాట్లాడుతూ..

కేసీఅర్ తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుంది.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయి.

ఢిల్లీ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయం..

కెసిఆర్ సారథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి గారి సహకారంతో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నాయకత్వంలోనే మీ గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు.

నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు చిరుమర్తి లింగయ్య

పేద ప్రజల కోసం నకిరేకల్ లో వంద పడకల ఆసుపత్రిని సాధించిన ఘనత చిరుమర్తి లింగయ్యకే దక్కుతుంది..

కేసీఆర్ పాలనలో ప్రతీ సంక్షేమ పథకం పేద ప్రజలకు వరంలా ఉన్నాయి..

రాష్ట్రంలో ప్రతీ వర్గాన్ని ఆదుకున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుంది..

దేశానికి అన్నంపెట్టే రైతు అవస్థలు పడొద్దనే ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుభీమా పథకాలు ఉద్భవించాయి.

తెలంగాణలో జరుగుతున్న సంక్షేమాన్ని ఓర్వలేకే బిజెపి ప్రభుత్వానికి కండ్లమంట..

ప్రతిదాంట్లో తెలంగాణ రాష్ట్రంపై బిజెపి వివక్ష చూపుతుంది.

అనంతరం వివిధ కుటుంబాలకు చెందిన 200 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 12 2023, 15:40

నల్లగొండ జిల్లాలోని పెళ్లి కి హాజరైన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి

నల్లగొండ జిల్లాలోని పెళ్లి కి హాజరైన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి .రాష్ట్ర ప్రధానకార్యదర్శి చంద్రవంక చిన్న రామస్వామి. జిల్లా అధ్యక్షులు దుడుకు లక్మి నారాయణ . ఈ సందర్భంగా అల్లంపల్లి రామకోటి మాట్లాడుతు విందువినోదాలు,పెళ్లి మండపాలు,గుడి గోపురాలు,పూజలు పుష్కరాలు ఉద్యమావేదికలుగా మార్చుకోవాలని అప్పుడైతేనే వాదం బలపడుతుంది అన్నారుు.

తదుపరి జిల్లాలోని TTD  కళ్యాణమండపంలోన మౌనిక పని నూతనదంపతులను ఆశీర్వదించారు. సమావేశములో దాసరాజు సతీష్ . సింహాద్రి జిల్లా రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు

నిజందాగదుక్షణంఆగదు

Feb 10 2023, 20:39

ఈనెల 13న జరుగు జాతీయ రహదారి దిగ్బంధం కరపత్రం ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు.

ఈనెల 13న జరుగు జాతీయ రహదారి దిగ్బంధం కరపత్రం ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు.

ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 13న హైదరాబాద్ విజయవాడ రహదారిని దిగ్భంధం విజయవంతం చేయాలని శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలో కరపత్ర ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు. 

ఈ కార్యక్రమంలో నకరికల్ నియోజకవర్గ ఇన్చార్జి మేడి శంకర్ మాదిగ నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ ఎరసాని గోపాల్ బొజ్జ చిన్న దుబ్బ రామకృష్ణ బొజ్జ దేవయ్య, మాసారం వెంకన్న, పోకల కరుణాకర్, మేడి గోవర్ధన్, బీపంగి అర్జున్, నవీన్ తదితరులు పాల్గొన్నారు